అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీఐ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్
పాల్వంచ, (సూర్యోదయ వార్త) కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాబా నగర్‌లో 31వ డివిజన్ కార్పొరేటర్ శ్యామల దినేష్ ఆధ్వర్యంలో అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిభావంతో నిర్వహించే అన్నప్రసాద కార్యక్రమాలు ఆధ్యాత్మికతతో పాటు సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమం భక్తిమయ వాతావరణంలో కొనసాగింది.





