కొత్తగూడెం, అక్టోబర్ 11 (సూర్యోదయ వార్త) సమాచార హక్కు చట్టం సాధన కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా రామ్ ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయనను జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేశారు. ఈ సందర్బంగా జాతీయ చైర్మన్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి మాట్లాడుతూ రామ్ ప్రతాప్ తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావం, దీక్ష, పట్టుదలతో నిర్వర్తించాలని, సమాచార హక్కు చట్టం సాధన కమిటీని జిల్లాలో మరింత బలోపేతం చేయడంతో పాటు, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు త్వరలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న హక్కులు, అవకాశాలపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. కాగా, కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ కార్పొరేటర్ జల్లి శ్రీలక్ష్మి నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యదర్శి రామ్ ప్రతాప్ కు నియామక పత్రం అందించి, శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు పొన్నెకంటి జయకుమారి, కుష్మి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నెకంటి సంజీవరాజు, సామల కృష్ణవేణి, కంచం రజిత తదితరులు పాల్గొన్నారు.





