సుజాతనగర్, అక్టోబర్ 5 (సూర్యోదయ వార్త) సుజాతనగర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చల్లగుండ్ల నరేష్ కుమార్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సుజాతనగర్ లో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గతంలో ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నరేష్ కుమార్ ను మరోసారి అధ్యక్షుడిగా కొనసాగించాలని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చల్లగుండ్ల నరేష్ కుమార్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, మండలంలోని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు తుంపురు శ్రీనివాస్, కార్యదర్శి రహీం పాషా, సబా అధ్యక్షులు ఉబ్బనపల్లి ప్రసాద్ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొని నరేష్ కుమార్ ను అభినదించారు.





